ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ని ఆదివారం తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్రం మాట్లాడుతూ లోకేశ్, కూటమి ప్రభుత్వం తన మీద నమ్మకంతో ఇచ్చిన పదవిని నూటికి నూరు శాతం న్యాయం చేస్తానని చెప్పారు. నారా లోకేశ్ సూచన ప్రకారం రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ ఆస్తులను సమిష్టి నిర్ణయంతో కాపాడతానని తెలిపారు.