తాడేపల్లి: మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ
మంత్రి నారా లోకేశ్ సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా తాడేపల్లి పట్టణం, రూరల్ మండలాల్లో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది మహిళలకు సోమవారం ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేశారు. 66వ బ్యాచ్లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్లో కుట్టుమిషన్లు అందజేశారు.