బాలల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సహకారం అందించడం అధికారుల బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం నరసరావుపేట స్థానిక ప్రకాశ్ నగర్ లోని శ్రీ తిలక్ మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం ద్వారా చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.