నరసరావుపేటలో గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఎవరైనా ఇసుక అధిక రవాణా చార్జీ వసూలు చేస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఇసుక రవాణాలో తలెత్తుతున్న లోపాలను సాధించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.