నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ సంబంధిత సమస్యలు, ఆక్రమణలు తదితర సమస్యలు ఉన్నాయని తెలిపారు. ప్రజల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.