ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ_ శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నరసరావుపేటకు చెందిన గుండాల రాకేష్ ను నియమించడం జరిగింది. కాగా శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ నుంచి దీనికి సంబంధించిన నియామక ఉత్తర్వులు గుండాల రాకేష్ అందుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ "ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెలుగుల పరిమళాలను వెదజల్లుతూ, తెలుగు భాషాభివృద్ధికి అమూల్యమైన సేవలు అందిస్తున్న ప్రఖ్యాతిగాంచిన శ్రీ శ్రీ కళా వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి గా ఎంపిక చేసిన ప్రపంచ తెలుగు సాహిత్య సాంస్కృతిక అకాడమీ చైర్మన్, శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ కి మరియు శ్రీ శ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతికి, జాతీయ ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరి భూషణం కి, రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరి సర్వోత్తమ నాయుడు కి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు కల్పించిన ఈ అమూల్యమైన బాధ్యతను ఎటువంటి శక్తి లోపం లేకుండా అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాననీ అన్నారు. గుండాల రాకేష్ ను పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పట్టణవాసులు, పలువురు అభినందించారు.