కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై లైంగిక దాడి, హత్య జరిగిన తీరును నిరసిస్తూ పట్టణంలోని న్యాయవాదుల ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్, న్యాయదేవత విగ్రహాల వద్ద మహిళలకు రక్షణ కల్పించాలని, వారికి ప్రత్యేక చట్టాలు తేవాలని నినాదాలు చేశారు. డాక్టర్ హత్యను ఖండిస్తూ నిందితులను అరెస్టు చేసి మరోసారి ఇటువంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.