నాగండ్లకు చెందిన రోటరీ గంగ నిధులతో, ఇంకొల్లు - నాగండ్ల రోడ్డుకు మరమ్మతులు చేపట్టినట్లు నాగండ్ల రోటరీ గంగ నూతన అధ్యక్షులు వీరగంధం ఆంజనేయులు తెలిపారు. పావులూరు గ్రామం నుంచి నాగండ్ల వరకు రోడ్డు గుంతలమయమై అద్వానంగా ఉంది. దీంతో తాత్కాలికంగా వాహనాల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా జేసీబీతో శనివారం మరమ్మతులు చేపట్టారు. నిధులు రూ. 50వేలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.