వైసీపీ పాలనలో సంక్షోభంలోకి వెళ్లిన పాలనను ముఖ్య మంత్రి చంద్రబాబు ఆరు నెలల కాలంలోనే చక్కదిద్దారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. సంక్షేమం దిశగా పయనించేలా అద్భుత పాలన సాగించారని పేర్కొన్నారు. శనివారం ఇంకొల్లు పట్టణంలో సుమారు 80 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ ఛైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్, మండల అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు ఉన్నారు.