కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో గురువారం ఏడీఏ మోహన్ రావు, ఏవో సుధీర్ బాబు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీఏ మోహన్ రావు మాట్లాడుతూ.. కారంచేడు మండల వ్యాప్తంగా ఈ సంవత్సరం సుమారు 9 వేల ఎకరాలు వరి పండించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సాధారణ రకం 75 కేజీలు రూ. 1725, గ్రేడ్ ఏ రకం రూ. 1740లకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.