పెదకూరపాడు మండల కేంద్రంలోని రెండవ అంగన్వాడీ కేంద్రంలో గురువారం గర్భిణీలు, బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న సర్పంచ్ గుడిపూడి రాజు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం అంటే పిల్లలను తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమను పంచేదే అన్నారు. బలమైన ఆహారం ప్రభుత్వం అందించే సదుపాయాలను అంగన్వాడీల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.