క్రోసూరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తారని స్థానిక టీడీపీ నాయకులు ఆదివారం తెలిపారు. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని సూచించారు.