రానున్న సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఐనవోలు ఎస్ఐ కృష్ణారావు మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ.. పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. అలాగే, రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు వంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.