పొన్నూరు మండల తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 8 అర్జీలు అందినట్లు తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ మీడియాకు తెలిపారు. అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖలకు పంపి సత్వరమే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.