పొన్నూరు పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో నూతన వసతి గృహాలను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల మాట్లాడుతూ దేవాలయాలు ప్రశాంతతకు, భక్తికి నిలయాలని అలాంటి దేవాలయాలలో గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని దుయ్యబట్టారు. ఈవో అమర్నాథ్, కోటమి శ్రేణులు పాల్గొన్నారు.