అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయండి.

1383చూసినవారు
అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయండి.
అంగన్వాడి కేంద్రాల పటిష్టతకు ప్రతి కార్యకర్త విధిగా కృషి చేయాలని జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిణి బి. మనోరంజని అన్నారు. శనివారం పొన్నూరు మండల పరిధిలోని మామిళ్ళపల్లి సెక్టర్ లోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. కేంద్రాల పరిధిలో ఉన్న చిన్నారులు బరువు , ఎత్తు, శారీరక ధారుఢ్యం తదితర అంశాలపై స్వయంగా ఆమె పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహార లోపం లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆహారం అందించాలని పిడి. మనోరంజని సూచించారు. అనంతరం పొన్నూరు ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన అంగన్వాడీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది అంగన్వాడీ కేంద్రాల పరిధిలో శిశు మరణాలు తగ్గించే కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పౌష్టికాహారం అందించటం ఎత్తు, బరువులు కొలతలు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. సిబ్బంది విధి నిర్వహణలో అలక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కేంద్రాలలో ప్రతిభ కనబరిచిన కార్యకర్త శ్రీదేవి, ఏఎన్ఎం కుసుమకుమారి లకు బహుమతులు ప్రధానం చేశారు. సిడిపిఓ. సరికొండ వెంకటరమణ, ప్రాజెక్ట్ సూపర్వైజర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్