కాకుమాను: భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులు

75చూసినవారు
కాకుమాను: భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులు
గుంటూరు జిల్లా కాకుమాను మండలం పాండ్రపాడు గ్రామంలో గురువారం మండల తహసిల్దార్ వెంకటస్వామి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సదస్సులో గ్రామంలోని ప్రజలు వివిధ భూ సమస్యలపై నాలుగు అర్జీలు అందించినట్లు తహసిల్దార్ వెంకటస్వామి తెలిపారు. సత్వర భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవిన్యూ సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. ప్రత్యేక అధికారి మోహన్ రావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్