పెదనందిపాడు మండలంలో రేపు శనివారం విద్యుత్ మరమ్మత్తుల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ కోటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెదనందిపాడు, నాగులపాడు, అనపర్రు, కొప్పర్రు, రాజుపాలెం, పాలపర్రు, అన్నవరం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.