ప్రత్తిపాడు మండలంలోని రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్ఐ నాగేంద్ర అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ మండలంలోని రౌడీషీటర్లు ఎటువంటి వివాదాలకు వెళ్లకుండా ఉండాలన్నారు. సత్ప్రవర్తనతో మెలగకపోతే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, సహకరించిన కేసులు నమోదు చేస్తామన్నారు.