అధికారులు, ప్రజల సమిష్టి కృషితో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. బుధవారం కాకుమాను శివాలయంలో మండల స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని గుర్తు చేశారు. గ్రామస్థాయి నుంచి ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.