రేపల్లె పట్టణంలోని 23వ వార్డుకు చెందిన అలపర్తి లావణ్య ఇంటిలో గుర్తు తెలియని దొంగలు 25 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లారు. ఈనెల రెండో తేదీన బాపట్లలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి గురువారం ఇంటికి వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళం పగలగొట్టి బీరువాలో 25 సవర్ల బంగారు ఆభరణాలు దొంగలు దొంగతనం చేసినట్లుగా ఫిర్యాదు చేసింది. పట్టణ సిఐ మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.