నగరం మండలం రీ సర్వేపై జరుగుతున్న గ్రామ సభలను సద్వినియోగపరుచుకుని సమస్యలను తమ దృష్టికి అర్జీల రూపంలో తీసుకురావాలని ప్రజలకు రేపల్లె ఆర్డిఓ ఎన్ రామలక్ష్మి అన్నారు. మంగళవారం పెద్దవరం గ్రామంలో ఏర్పాటు చేసిన రీ- సర్వే గ్రామ సభను ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ మండలంలోని రీ సర్వే పూర్తయిన పంచాయతీల్లో నిర్వహించే గ్రామ సభలో పట్టాదారులు తమ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు.