ఈనెల 22వ తేదీన సత్తెనపల్లిలోని ప్రజా వేదికలో జాబ్ మేళా జరుగుతుందని సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో యువతకు ఇచ్చిన హామీని నెరవేర్చటానికి జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని యువతీ, యువకులందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.