రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని పెట్ బాషహీరాబాద్ లో జరిగింది. పల్నాడు జిల్లా రాజులపాలెం గ్రామానికి చెందిన అనీల్ (25), హైదరాబాద్ లో ఉంటున్న కార్తీక్ రెడ్డి(26) స్నేహితులు. అయ్యప్ప మాలలో ఉన్న వీరు శుక్రవారం శబరిమల వెళ్లి తిరిగొచ్చారు. అదే రోజు రాత్రి బైక్ పై వస్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. కార్తీక్ అక్కడికక్కడే చనిపోగా అనీల్ ఆస్పత్రిలో మృతి చెందాడు.