రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ పోటీల్లో 18 పతకాలను కైవసం చేసుకుని పల్నాడు జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గతనెల 29, 30, 31 వరకు జరిగిన 11వ రాష్ట్రస్థాయి పోటీల్లో పల్నాడు జిల్లాకు చెందిన 10 మంది క్రీడాకారులు 11 బంగారు, 4 రజత, 3 కాంస్య పతకాలను మొత్తంగా 18 పతకాలను సాధించారు. ఎన్. శరత్ జూనియర్స్, సీనియర్స్ స్ట్రాంగ్ మెన్‌గా టైటిల్ కైవసం చేసుకున్నారు.