కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

55చూసినవారు
నకరికల్లు మండలంలోని నరసింగపాడులో కొలువైన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, రుద్ర హోమాలు తదితర పూజలు చేశారు. మహిళలు పొంగళ్ళు పొంగించి నైవేద్యాలు సమర్పించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్