అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు

572చూసినవారు
అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు
తాడికొండ మండలంలో కొంతమంది వైసిపి నాయకులు నీరు చెట్టు కార్యక్రమంలో మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు కంతేరు గ్రామంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపణలు చేయటాన్ని, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్రి పాల్ బాబు ఖండించారు. దీనిపై ఎప్పుడూ అయినా ఎక్కడ అయినా బహిరంగ చర్చకు సిద్దం అని, నిజాలు తెలుసుకొని మాట్లాడాలి అని, పదే పదే తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ఎంతగానో తొర్పడింది అన్నారు. ఇక మీద తెలుగుదేశం పార్టీ నాయకులు పైన గాని, పార్టీ మీద కానీ, అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి శిఖా శంకరరావు, మాజీ సర్పంచ్ కర్రి నాగమల్లేశ్వర రావు, మాజీ ఉప సర్పంచ్ జెట్టి బ్రహ్మనాయుడు, మల్లవరపు ఇమానేయులు, బుల్లా ప్రభుదాసు, పట్నం మరియు దాసు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్