ఫిరంగిపురం: బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

51చూసినవారు
ఫిరంగిపురం: బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు
ఫిరంగిపురం మండల పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రవీంద్రబాబు హెచ్చరించారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మండల పరిధిలో ఎవరైనా మద్యాన్ని తీసుకొచ్చి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కేసులను నమోదు చేసి కఠినంగా వ్యవహారించాల్సి ఉంటుందన్నారు. మద్యం దుకాణాల యజమానులు కూడా నిర్దేశిత ధరలకే అమ్మకాలు జరపాలన్నారు.

సంబంధిత పోస్ట్