రాజధానిలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

72చూసినవారు
రాజధాని ప్రాంతమైన తుళ్ళూరులో ఆదివారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు టపాసులు కాల్చి, కేక్ కటింగ్ నిర్వహించి ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. త్వరలో వర్గీకరణ జరుగుతుందన్నారు. ఇప్పటికే ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఈ సమాజంలోని బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం, వికలాంగుల పెన్షన్ తదితర వాటి కోసం పాటు పడిందన్నారు.

సంబంధిత పోస్ట్