తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన పాలపాటి రాజేష్ తనని వడ్లమూడి సాంబశివరావు అనే వ్యక్తి కులం పేరుతో దూషించాడని తాడికొండ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో రావలసిన డబ్బులు వడ్లమూడి సాంబశివరావు ఇంటికి వెళ్లి అడుగుగా తనను కులం పేరుతో దూషించి అవమానించారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.