యువతి అదృశ్యంపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెనాలి మండలంలోని కొలకలూరు కు చెందిన 24 ఏళ్ల యువతి తెనాలిలోని కంప్యూటర్ ఇన్ స్ట్యూట్ కు రోజు వెళ్తుంది. ఈ నెల 5 వ తేదీన ఇన్ స్ట్యూట్ కు వచ్చిన ఆమె కనబడకుండ పోయింది. కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించిన కనిపించక పోవడంతో టూ టౌన్ పోలీసులను ఆశ్రయించగా శనివారం కేసు నమోదు చేశారు.