కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకి వెళుతుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. భట్టిప్రోలులో మంగళవారం ఏర్పాటు చేసిన టీడీపీ మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారన్నారు. సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు.