వేమూరులోని లక్ష్మీ పద్మావతి కల్యాణ మండపం నందు సోమవారం టిడిపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని పార్టీ కార్యాలయ వ్యక్తిగత సిబ్బంది ఆదివారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధిపై చర్చిస్తారని ఆయన పేర్కొన్నారు. కావున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకావాలని వారు కోరారు.