వేమూరు: హెరిటేజ్ ఫుడ్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు
హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ, పాడి పశువుల రైతులకు ఆర్థిక సాయం అందిస్తూ, వారిని అభివృద్ధి చేయడంలో సాంకేతిక విధానాలను వినియోగిస్తున్నట్లు సంస్థ ప్రాంతీయ అధికారి పి. నాగ అప్పారావు తెలిపారు. శనివారం, అమృతలూరులోని విఘ్నేశ్వర టెంపుల్ సమీపంలోని భట్టిప్రోలు యూనిట్లో పాడి పశువుల పోషణ, పౌష్టికాహార పద్ధతులపై అవగాహన సదస్సు జరిగింది.