ఆవుల యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించిన.. మున్సిపల్ కమిషనర్

51చూసినవారు
ఆవుల యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించిన.. మున్సిపల్ కమిషనర్
వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పట్టిఉంచిన గోవులను తనిఖీ చేసి వైద్యం అందించాలని ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు సూచన మేరకు మున్సిపాలిటీ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పశుసంవర్ధక శాఖ అధికారులను పిలిపించి పశుసంవర్ధక వైద్యులు ఆవులను మంగళవారం పరిశీలించారు. పశువులకు ఆరోగ్య ధృవీకరణ పత్రాలను జారీ చేశారన్నారు. ఆవుల యొక్క ఆహారం మరియు ఆశ్రయం నిర్వహణపై వైద్యులు సలహాలు సూచనలు ఇచ్చారని తెలిపారు.

సంబంధిత పోస్ట్