AP: తానే స్వయంగా వెళ్లి పేదలకు పింఛన్లు ఇవ్వడం సంతృప్తిగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లకు రూ.33,100 కోట్లు ఖర్చు పెడుతూ..ప్రతినెలా 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో నొక్కిన బటన్లు అన్నీ ఈ ఒక్క పెన్షన్‌తో సమానమని ఆయన విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా నిలుస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.