కరోనా సమయంలో వలస కార్మికుల సమస్యలపై నమోదైన సుమోటో కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికిపైగా ఉచిత, సబ్సిడీ రేషన్‌ను పొందుతున్నారని కేంద్రం తెలిపింది. ఈ సమాధానం విని ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు ధర్మాసనం ‘ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తారు’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ఫోకస్ చేస్తే బాగుంటుందని సూచించింది.