HCU భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కంచ గచ్చిబౌలి భూముల్లో అతి పెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డికి మంత్రులు సూచించినట్లు సమాచారం. 400 ఎకరాలతో పాటు మరో వెయ్యి ఎకరాలు సేకరించాలని.. రాజీవ్ పార్క్గా పేరు పెట్టాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్కే తలమానికంగా, 2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.