శారదా పీఠం భవనం కూల్చేందుకు ఆదేశాలిస్తాం: హైకోర్టు

54చూసినవారు
శారదా పీఠం భవనం కూల్చేందుకు ఆదేశాలిస్తాం: హైకోర్టు
AP: తిరుమలలోని శారదాపీఠం భవన నిర్మాణం విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని తెలిపింది. తిరుమలలో ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపితే ఏం జరుగుతుందో ఈ కేసు ఒక ఉదాహరణ కావాలని వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని శారదా పీఠాన్ని హైకోర్టు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్