శారదాపీఠం భవనం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

68చూసినవారు
శారదాపీఠం భవనం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తిరుమలలోని శారదాపీఠం భవన నిర్మాణం విషయంలో ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. శారదాపీఠం నిర్మించిన భవనంపై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని తెలిపింది. తిరుమలలో ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపితే ఏం జరుగుతుందో ఈ కేసు ఒక ఉదాహరణ కావాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్