ఏపీ హోం మంత్రి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ కోర్టులోని చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హోం మంత్రి అనిత, ఫిర్యాదుదారుడు నేడు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.