గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కలిసి వైసీపీని ఓడించాయి. అయితే ఈ పార్టీల అధినాయకత్వంగా బాగానే ఉన్నప్పటికీ, ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి కుటమిలో లుకలుకలు బయటపడ్డాయి. కర్నూలు జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేత మీనాక్షినాయుడు, జనసేన నాయకులకు మధ్య మాటా మాటా పెరిగి.. తీవ్రస్థాయిలో దూషించుకున్నారు. తర్వాత.. తోపులాటలకు దిగారు.