సూపర్ సిక్స్ హామీల అమలుపై కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక విషయాలు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం.. భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు తగ్గిన 10శాతం రిజర్వేషన్ కోటా పునరుద్ధరణకు చర్యలు, జూన్ లోగా మరో 3 హామీలుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.