తిరుమల అన్నదాన సత్రంలో బాలుడు మృతిపై టీటీడీ స్పందించింది. తిరుమలలో తొక్కిసలాటకు ఆస్కారం లేదని తెలుపుతూ సీసీ ఫుటేజ్‌ని విడుదల చేసింది. బాలుడికి గతంలోనే గుండె ఆపరేషన్ జరిగిందని, ర్యాంప్‌పై పరిగెడుతూ బాలుడు పడిపోయాడని తెలిపింది. బాలుడికి వెంటనే సీపీఆర్ చేశామని, బాలుడు చనిపోవడం దురదృష్టకరమని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. ఈ విషయంలో టీటీడీపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని ఆయన హితవు పలికారు.