AP: టూరిజం శాఖకు ఇండస్ట్రీయల్ స్టేటస్ తీసుకువచ్చామని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాపికొండల పర్యాటకం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 27 నుంచి విశాఖపట్నంలో టూరిజం ఇన్వెస్టర్ మీట్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు 150 మంది ఇన్వెస్టర్లు వస్తున్నారని చెప్పారు.