గణతంత్ర దినోత్సవానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం

77చూసినవారు
గణతంత్ర దినోత్సవానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం
గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న విద్యార్థుల వ్యాన్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక స్టూడెంట్‌ మరణించగా డ్రైవర్‌తో సహా 23 మంది గాయపడ్డారు. ఒడిశాలోని సుబర్ణపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అథాగఢ్‌లోని నార్త్ బంకి మాలా బీహార్‌పూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సారందా మైదానానికి వ్యానులో వెళ్తుండగా వ్యాను బోల్తా పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్