తిరుమల లడ్డూ తయారీపై సైంటిస్ట్, రచయిత ఆనంద్ రంగనాథన్ చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తిరుమల లడ్డూ పవిత్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. 'లడ్డూలను తయారు చేసిన తర్వాత నెయ్యిని పరీక్షించవద్దు. నెయ్యిని టెస్ట్ చేశాకే లడ్డూలు తయారు చేయండి. దీనికి HPLC, GCMS, DSC FTIR మెషీన్లు అవసరం. వాటికయ్యే ఖర్చు రూ.1.65cr. శ్రీవారి నెలవారీ ఆదాయం రూ.110కోట్లు' అని ఆనంద్ వీడియోలో పేర్కొన్నారు.