ఏపీ రాజధాని అమరావతి జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. రూ.36 కోట్ల వ్యయంతో 250 పొక్లెయిన్లతో 50 వేలకు పైగా ఎకరాల్లో ముళ్ల చెట్లు, పొదలను తొలగించనున్నారు. జంగిల్ క్లియరెన్స్ తర్వాత సీఆర్డీఏ అధికారులు మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టనున్నారు. స్థలాలు కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా పనులు నిర్వహించనున్నారు.