కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలంలోని గండికోట గ్రామం నుండి గురువారం జమ్మలమడుగుకు ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బయలుదేరింది. ఈ క్రమంలోనే జమ్ములమడుగు ఘాట్ రోడ్డులో స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అయితే స్కూల్ వ్యాన్ డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఈఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.