జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను గాలికి వదిలేశారన్నారు. జనవరి కానుకగా ప్రతి ఇంటికి కరెంట్ బిల్ ప్రజలపై అదనంగా భారం వేయనున్నారని జగన్ ప్రభుత్వం ఏమి చేసిందో ఎన్నికల ముందే చెప్పారని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.